బావ లిప్స్ దగ్గర ఫింగర్ పెడితే కరెంటు షాకే..
on Jan 10, 2025
ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈ ఆదివారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షో ఒక్క కార్తీక దీపం షో స్పెషల్ గా మారిపోయింది. ఇక పాపం వాళ్ళ దగ్గర డబ్బులు లేక సంక్రాంతి పండగ చేసుకోలేకపోతున్నారంటూ హోస్ట్ హరి చెప్పేసరికి రోహిణి, శ్రీముఖి పాపం కన్నీళ్లు పెట్టుకుని కార్తీక దీపం ఫామిలీ మొత్తాన్ని స్టేజి మీదకు పిలిచారు. ఇక ఇందులో డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల కోసం ఒక పక్క జ్యోత్స్న మరో పక్క దీప పోటీ పడ్డారు. తనను పెళ్లి చేసుకుని ఉంటే మంచి పిండి వంటలు ఉంటాయి అంటూ జ్యోత్స్న చెప్పేసరికి తనకు ప్రేమ అభిమానం ఇంపార్టెంట్ అంటూ దీప పక్కన నిలబడ్డాడు డాక్టర్ బాబు. ఇక జ్యోత్స్నకి, దీపాలకు పిండి వంటలు చేసే కాంటెస్ట్ పెట్టింది శ్రీముఖి. "అక్కా..పిండి వంటలు చేసే పోటీలో గెలిస్తే బావని నాకు ఇచ్చేస్తావా" అని జ్యోత్స్న దీపాని అడిగింది.
"లేదు మేము వేసిన చేగోడీలు ఇస్తాం" అంటూ దీప బదులు డాక్టర్ బాబు ఆన్సర్ ఇచ్చాడు. "బావకు నా జంతికలు ఇష్టం" అని జ్యోత్స్న చెప్పేసరికి "అదంతా కాదులే కానీ..జంతికలు ఏ పిండితో చేస్తారు" అనేసరికి నటకుమారి మధ్యలో వచ్చి "జంతికలు మైదా పిండితో చేస్తారని చెప్పింది" దానికి దీప షాకైపోయింది. ఇక జ్యోత్స్నకి, దీపకి డ్రాయింగ్ కాంపిటీషన్ కూడా పెట్టింది. జ్యోత్స్న డాక్టర్ బాబు బొమ్మ గీసింది. తర్వాత బొమ్మ లిప్స్ దగ్గర చెయ్యి పెట్టి మరీ ఓవర్ యాక్షన్ చేసింది. "బావ లిప్స్ దగ్గర ఫింగర్ పెడితే కరెంటు షాకే" అంటూ కొంటెగా రొమాంటిక్ డైలాగ్ చెప్పేసరికి నిరుపమ్ నిజంగా షాకైపోయాడు. ఇక దీపా వేసిన బొమ్మను చూసి శ్రీముఖి కౌంటర్ వేసింది. " మీరు ఎక్కడ ఉన్నా వెతుక్కోవాల్సి వస్తోంది" అంటూ చెప్పింది. కార్తీక దీపం సీరియల్ ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్. అందులో మోనిత రోల్ కేక. ఇక దీపకి మోనితకి మధ్యలో నలిగిపోయే డాక్టర్ బాబు రోల్స్ ఇప్పటికీ ఎవర్ గ్రీన్. సీజన్ 2 వచ్చింది కానీ అనుకున్నంత రేటింగ్ ఐతే రావడం లేదు. ఆడియన్స్ ఐతే చూస్తున్నారు. "దీపక్క..డాక్టర్ బాబు వచ్చారుగా సంక్రాంతి పండగ ఇక అదిరిపోద్ది" అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read